తెలంగాణ

telangana

TS HIGHCOURT: కేబీఆర్​ పార్కులో చెట్లు కొట్టేయొద్దు... హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

By

Published : Aug 11, 2021, 4:04 PM IST

Updated : Aug 11, 2021, 6:47 PM IST

హైదరాబాద్​ నగరంలోని కేబీఆర్‌ పార్కులో చెట్లు కొట్టివేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రహదారుల అభివృద్ధికి పార్కులో చెట్లను కొట్టేస్తున్నారని దాఖలైన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

TS HIGHCOURT:  కేబీఆర్​ పార్కులో చెట్లు కొట్టేయద్దు... హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
TS HIGHCOURT: కేబీఆర్​ పార్కులో చెట్లు కొట్టేయద్దు... హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో చెట్లను నరకవద్దని అటవీ శాఖకు హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కాజల్ మహేశ్వరి, మరో ఇద్దరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.

వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకంలో భాగంగా కేబీఆర్ పార్కులో చెట్లను కొట్టేస్తున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. తదుపరి విచారణ వరకు కేబీఆర్ పార్కులో చెట్లను నరకవద్దని ఆదేశించింది. ఇప్పటి వరకు ఎన్ని చెట్లు తొలగించారు.. వాటి రకాలు, వయసు తదితర పూర్తి వివరాలను నాలుగు వారాల్లో సమర్పించాలని అటవీ శాఖను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

ఇదీ చదవండి: Ganesh immersion: నిమజ్జనంపై నిర్ణయానికి వారం సమయం కోరిన ప్రభుత్వం

Last Updated : Aug 11, 2021, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details