తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజల సమాచారం ప్రభుత్వం సేకరిస్తే అంగీకరించం: హైకోర్టు​ - High Court orders to State Government

ప్రజల సమాచారం ప్రభుత్వం సేకరిస్తే అంగీకరించం: హైకోర్టు
ప్రజల సమాచారం ప్రభుత్వం సేకరిస్తే అంగీకరించం: హైకోర్టు

By

Published : Dec 17, 2020, 4:37 PM IST

Updated : Dec 17, 2020, 5:25 PM IST

16:35 December 17

ప్రజల సమాచారం ప్రభుత్వం సేకరిస్తే అంగీకరించం: హైకోర్టు

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్‌ అడగొద్దని హైకోర్టు ఆదేశించింది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని స్పష్టం చేసిన ధర్మాసనం... ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని సూచించింది. కులం, కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని పేర్కొంది.

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగించవచ్చని హైకోర్టు తెలిపింది.  రిజిస్ట్రేషన్ కోసం ఇతర గుర్తింపు పత్రాలు అడగవచ్చన్న ధర్మాసనం... న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొంది. ప్రజల సున్నితమైన సమాచారం ప్రభుత్వం సేకరిస్తే అంగీకరించమని స్పష్టం చేసింది.  

ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతపైనే మా ఆందోళన అంటూ వ్యాఖ్యలు చేసింది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో మార్పులు చేసి సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 28కి వాయిదా వేసింది.  

ఇదీ చూడండి:లైవ్ వీడియో: పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య

Last Updated : Dec 17, 2020, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details