భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల అడవుల్లో జరిగిన లింగన్న ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల సంఘం ధర్మాసనాన్ని ఆశ్రయించింది. లింగన్నను బూటకపు ఎన్కౌంటర్లో చంపారని పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం లింగన్న మృతదేహానికి రేపు సాయంత్రం ఆరు గంటలలోగా రీపోస్టుమార్టం నిర్వహించాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. ముగ్గురు నిపుణులతో పోస్టుమార్టం నిర్వహించి ఆగస్టు 5లోపు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఎన్కౌంటర్ ఛత్తీస్‌గఢ్ పరిధిలో జరిగిందని విచారణ సమయంలో అదనపు అడ్వకేట్ జనరల్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
'లింగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించండి' - HIGH COURT ORDERED TO RE-POSTMARTAM TO LINGAIAH BODY
గుండాల ఎన్కౌంటర్లో మరణించిన లింగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని హైకోర్టు ఆదేశించింది. ముగ్గురు నిపుణులతో పోస్టుమార్టం నిర్వహించి ఆగస్టు 5 లోగా నివేదిక ఇవ్వాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.
!['లింగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించండి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4010789-thumbnail-3x2-ppp.jpg)
HIGH COURT ORDERED TO RE-POSTMARTAM TO LINGAIAH BODY
లింగన్న మృతదేహాన్ని రీ పోస్టుమార్టం నిర్వహించండి
ఇవీ చూడండి: అదిగో చిరుత, ఇదిగో తోక... అంతా ఉత్తదే..