డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు చేయాలన్న పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆ అంశంపై ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. యూజీసీ మార్గదర్శకాల మేరకు పరీక్షలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం. ఆ ప్రకారం పరీక్షలు రద్దు చేయడం కుదరదని ప్రభుత్వం తెలిపింది. పరీక్ష తేదీలను త్వరలో వెల్లడిస్తామని ఏజీ చెప్పారు.
డిగ్రీ, పీజీ పరీక్షల రద్దుపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - High Court order on the government to cancel degree and PG exams
యూజీసీ మార్గదర్శకాల మేరకు పరీక్షలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం. ఆ ప్రకారం పరీక్షలు రద్దు చేయడం కుదరదని ప్రభుత్వం తెలిపింది. 3 వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
డిగ్రీ, పీజీ పరీక్షల రద్దుపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్నల్ మార్కుల ద్వారా గ్రేడింగ్ ఇవ్వాలని పిటిషనర్ తెలిపారు. యూజీసీ మార్గదర్శకాలు కేవలం సూచనలు మాత్రమేనన్న పిటిషనర్, ఏడెనిమిది రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. 3 వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఇదీ చూడండి :నూటికి 70శాతం మందికి కరోనా సోకుతుంది: తలసాని