తెలంగాణ

telangana

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవాలపై తీర్పు రిజర్వ్​

By

Published : Mar 8, 2021, 6:21 PM IST

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాల పిటిషన్‌పై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవాలపై హైకోర్టులో విచారణ
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవాలపై హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్​లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పిటిషన్లపై తీర్పును ఆ రాష్ట్ర హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. గతేడాది జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు... తీవ్ర అడ్డంకులు, బెదిరింపులు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయని... అందుకే తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఎస్​ఈసీని ఆదేశించాలని జనసేన పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. బెదిరింపులు, దౌర్జన్యాల వల్ల నామినేషన్ వేయలేని వారు అందజేసిన వివరాలతో నివేదికలు ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ గతనెల ఎస్‌ఈసీ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌పై వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం ఇవాళ తుది విచారణ నిర్వహించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం...తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

ఇదీచదవండి:బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: మహమూద్‌ అలీ

ABOUT THE AUTHOR

...view details