High court on teachers transfers : ఉపాధ్యాయుల బదిలీలపై స్టే ఎత్తివేయాలన్న ప్రభుత్వ మధ్యంతర పిటిషన్‌పై.. ఈనెల 7న విచారణ జరుపుతామని హైకోర్టు వెల్లడించింది. టీచర్ల బదిలీల్లో భార్యాభర్తలకు, యూనియన్ల ప్రతినిధులకు ప్రత్యేక పాయింట్లను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు.. ఇవాళ సీజే జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం వద్ద విచారణకు వచ్చాయి.
ఉపాధ్యాయ బదిలీలపై స్టే విధిస్తూ హైకోర్టు మార్చి 7న బదిలీలపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్టే ఎత్తివేయాలని కోరుతూ గతంలోనే ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ వేసింది. టీచర్ల బదిలీలకు సంబంధించిన పిటిషన్లపై వీలైనంత త్వరగా విచారణ జరపాలని అందులో కోరింది. హైకోర్టులో 2005లో దాఖలైన పిటిషన్లు కూడా పెండింగులో ఉన్నాయని.. ఈ అంశాన్నే అత్యవసరంగా తేల్చాలంటే ఎలా అని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషన్లపై పూర్తిస్థాయి విచారణ తర్వాత చేపడతామన్న హైకోర్టు.. స్టే ఎత్తివేయాలన్న మధ్యంతర అభ్యర్థనపై సోమవారం వాదనలు వింటామని తెలిపింది.
High court on Group1 prelims : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలన్న పిటిషన్‌పైహైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. జూన్ 11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై.. జస్టిస్ పి.మాధవీదేవి ఇవాళ మరోసారి విచారణ జరిపారు. అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలు నమోదు చేయలేదని.. హాల్‌టికెట్ నంబరు, ఫోటో లేకుండా ఓఎంఆర్ షీటు ఇచ్చారన్నది అభ్యర్థుల వాదన.