High Court on Public Representatives Cases :రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసులను త్వరితగతిన విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను విచారించడానికి హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే, జిస్టిస్ వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులను విచారించింది.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోర్టులలో ప్రస్తుత, మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను రిజిస్ట్రార్ జనరల్, ధర్మాసనానికి నివేదించారు. 115 కేసులు పెండింగులో ఉన్నాయని పేర్కొనడంతో 46 కేసుల్లో నిందితులకు 2 వారాల్లో సమన్లు జారీ చేయాలని కోర్టులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 10 కేసుల్లో ఉన్న స్టేలపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.