High Court Verdict on Pharma City Land Acquisition : ఫార్మా సిటీ భూసేకరణపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి, కుర్మిద్దలో భూసేకరణకు 2017లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. భూసేకరణ పరిహార ఉత్తర్వులనూ రద్దు చేసింది. ఫార్మాసిటీ భూసేకరణ నోటిఫికేషన్, పరిహారంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన 23 పిటిషన్లపై విచారణ జరిపి రిజర్వ్ చేసిన హైకోర్టు.. తొమ్మిదింటిపై జస్టిస్ ఎం.సుధీర్ కుమార్ కీలక తీర్పు వెల్లడించారు.
భూసేకరణ ప్రక్రియ చట్టబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగా జరగలేదని హైకోర్టుపేర్కొంది. భూసేకరణలో అధికారుల తీరుపై ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ప్రతిష్టాత్మకమైన ఫార్మాసిటీ ప్రాజెక్టు 2015లో ప్రారంభమైనా.. న్యాయపరమైన వివాదాల వల్ల ఇప్పటికీ రూపుదిద్దుకోలేదని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వివిధ హోదాల్లో ఉన్న ఐఏఎస్ అధికారులు భూసేకరణ చట్టం, కనీస ప్రక్రియను ఎందుకు అర్థం చేసుకోవడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. భూసేకరణ చేయాల్సిన విధివిధానాలను వివరిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ 2017లో మెమో ఇచ్చినప్పటికీ.. కలెక్టర్లు, భూసేకరణ అధికారులు వాటిని పక్కన పడేశారని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.
Telangana High Court : తొలి తెలుగు తీర్పుతో.. హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ హైకోర్టు
Medipalli land acquisition dispute : కోర్టులో కేసులు దాఖలైన తర్వాతయినా అధికారులు ఎందుకు తేరుకోవడం లేదో అర్థం కావడం లేదని తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు. తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసే బదులుగా.. బాధ్యతగా సవరించుకుంటే ఎంతో విలువైన సమయం మిగిలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అసలు అధికారులు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారా లేక.. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పాలసీలను తుంగలో తొక్కుతున్నారా అనే అనుమానం కలుగుతోందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టులో పిటిషనర్లను లేవనెత్తిన అభ్యంతరాలు, లోపాలను సరిచేసి ఉంటే.. మూడేళ్లు వృథా కాకపోయేదని హైకోర్టు పేర్కొంది.
Highcourt Notices to BRS : కోకాపేటలో 11 ఎకరాల భూకేటాయింపు.. ప్రభుత్వానికి, బీఆర్ఎస్కు హైకోర్టు నోటీసులు
Kurmidda Land Acquisition Act : పునరావాస చట్టంలోని సెక‌్షన్ 15 కింద అభ్యంతరాలను 3 నెలల్లో స్వీకరించి.. మళ్లీ భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు ఆదేశించింది. నిర్వాసితులు రెండు వారాల్లో అభ్యంతరాలను తెలిపి భూసేకరణకు సహకరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గత నోటిఫికేషన్‌లోని మార్కెట్ విలువను పక్కన పెట్టి.. ఈ తీర్పు తేదీని ప్రామాణికంగా తీసుకుని నిర్ణయించాలని పేర్కొంది. అధికారులు, నిర్వాసితులు పరస్పరం చర్చించుకొని పరిహారం ఖరారు చేయాలని సూచించింది.
HighCourt on Telangana Floods : వరద ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
Telangana HC on Transgender Admission in PG : 'అర్హత ఉన్నా.. ఆ ట్రాన్స్‌జెండర్‌కు ప్రవేశం ఎందుకు కల్పించలేదు..?'
Bhatti Vikramarka VS Harish Rao : దేశానికి వైద్యం అందించే శక్తిగా రాష్ట్రం ఎదుగుతోంది: హరీశ్ రావు