ఉస్మానియా వివాదాలన్నీ ఆగష్టు 17న విచారిస్తాం : హైకోర్టు - ఉస్మానియా దవాఖాన
ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించిన అన్ని వివాదాలను కలిపి ఒకేసారి విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు తెలిపింది. ఉస్మానియా ఆస్పత్రికి మరమ్మతులు చేయాలన్న రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు మంగళవారం నాడు విచారణకు వచ్చాయి. అయితే ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించిన మొత్తం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ఒకేసారి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.
ఉస్మానియా ఆస్పత్రి మీద ప్రతిపక్షాలు, పలువురు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను అన్ని ఒకేసారి విచారించనున్నట్టు హైకోర్టు ధర్మాసనం తెలిపింది. ఉస్మానియా ఆస్పత్రికి మరమ్మత్తులు చేయాలన్న రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు మంగళవారం విచారణకు వచ్చాయి. వాటిని పరిశీలించిన ధర్మాసనం ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించి మొత్తం ఐదు పిల్స్ ఉన్నాయని, అన్నింటిని కలిపి ఆగష్టు 17న విచారిస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎస్ చౌహన్, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఉస్మానియా ఆస్పత్రిని కూల్చివేసి కొత్తగా నిర్మించాలని ఒక వ్యాజ్యం, చారిత్రక భవనాన్ని కూల్చకుండా అడ్డుకోవాలని ఒక వ్యాజ్యం ఇలాంటి పలు వ్యాజ్యాలు మొత్తం ఐదు ఉన్నట్టు.. వాటికి ఒకేసారి విచారించనున్నట్టు హైకోర్టు తెలిపింది.