తెలంగాణ

telangana

ETV Bharat / state

వివాదాలు లేని మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సై: హైకోర్టులో ఈసీ - మున్సిపాలిటీల్లో

రాష్ట్రంలో ఎలాంటి వివాదాలులేని  69 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదించింది.  మున్సిపల్ ఎన్నికలపై అన్ని పిటిషన్లను కలిపి విచారణ జరపాలని కోరింది. రేపు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.

69 మున్సిపాలిటీలో ఎన్నికలకు సై: ఈసీ

By

Published : Aug 5, 2019, 10:20 PM IST

Updated : Aug 6, 2019, 12:00 AM IST

రాష్ట్రంలో ఎలాంటి వివాదాలులేని 69 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదించింది. ఎన్నికల వివాదంపై ఉన్న పిటిషన్లపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరింది. మొత్తం 126 మున్సిపాలిటీలలో వార్డుల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల కేటాయింపులకు సంబంధించి వివాదాలు తలెత్తాయని ఎస్​ఈసీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. వీటిలో 69 మున్సిపాలిటీల్లో ఎలాంటి వివాదాలు లేవని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారా అన్ని ధర్మాసనం ప్రశ్నించింది. వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి సింగిల్ జడ్జి ముందు పలు పిటీషన్లు దాఖలయ్యయని న్యాయవాది తెలిపారు. అన్ని వ్యాజ్యాలను కలిపి విచారించాలని అభ్యర్థించారు. స్పందించిన ధర్మాసనం రేపు విచారణ చేపడతామని తెలిపింది.

వివాదాలు లేని మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సై: హైకోర్టులో ఈసీ
Last Updated : Aug 6, 2019, 12:00 AM IST

ABOUT THE AUTHOR

...view details