కొవిడ్ చికిత్సకు అందించే ఆనందయ్య మందు(anandaiah medicine)కు ఏపీ ప్రభుత్వం ఆయుష్ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని.. ఆయుర్వేద ఔషధ నిపుణుడు అనందయ్య తరఫు న్యాయవాది ఎన్ అశ్వనీకుమార్ ఏపీ హైకోర్టుకు తెలిపారు. అయితే మందుకు పేరును ఖరారు చేయాల్సి ఉందన్నారు. కంటిచుక్కల మందుకు ఆమోదం ఇచ్చే అంశంపై జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉందని వివరించారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. అంగీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
anandaiah medicine: ఆనందయ్య మందుకు సూత్రప్రాయ అనుమతి! - ఏపీ హైకోర్టు తాజా వార్తలు
ఆనందయ్య(anandaiah medicine) తయారు చేసిన కొవిడ్ మందుకు ఏపీ ఆయుష్ శాఖ సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చిందని అనందయ్య తరఫు న్యాయవాది ఎన్ అశ్వనీకుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తెలిపారు. అయితే మందుకు పేరును ఖరారు చేయాల్సి ఉందన్నారు.
ఏపీ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కొవిడ్‌కు తాను తయారు చేసిన ఆయుర్వేద ఔషధాల పంపిణీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకుండా అధికారులను నిలువరించాలని కోరుతూ.. ఆనందయ్య హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేద, సంప్రదాయ మందు పంపిణీ కార్యక్రమం కొనసాగేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పలువురు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి:Minister puvvada: సైకిల్‌పై మంత్రి పువ్వాడ.. ఖమ్మం వీధుల్లో పర్యటన