తెలంగాణ

telangana

ETV Bharat / state

హెబియస్ కార్పస్ పిటిషన్‌పై పోలీసులకు హైకోర్టు నోటీసులు

Bandi Sanjay arrested
Bandi Sanjay arrested

By

Published : Apr 6, 2023, 2:50 PM IST

Updated : Apr 6, 2023, 4:09 PM IST

14:42 April 06

హెబియస్ కార్పస్ పిటిషన్‌పై పోలీసులకు హైకోర్టు నోటీసులు

High Court notices to Telangana Police: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ బీజేపీ హైకోర్టులో వేసిన హెబియస్​ కార్పస్​ పిటిషన్​ ఇవాళ విచారణకి వచ్చింది. బండి సంజయ్​ను​ అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

మరోవైపు బండి సంజయ్‌ రిమాండ్‌ రద్దు చేయాలని కోరుతూ బీజేపీ వేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని బండి సంజయ్‌కు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది.

Bandi Sanjay arrest: పదో తరగతి ప్రశ్నాపత్రాలు బయటికి వచ్చిన వ్యవహారంలో సూత్రధారి బండి సంజయ్‌ అంటూ.. కరీంనగర్‌, కమలాపూర్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో సంజయ్‌ను కుట్రదారుగా పేర్కొన్న పోలీసులు.. రిమాండ్‌ రిపోర్టులో ఆయనను 'ఏ1'గా చేర్చారు. సంజయ్​ ప్రోద్బలంతోనే మిగిలిన నిందితులు ప్రశ్నపత్రాన్ని పరీక్షకేంద్రం నుంచి దొంగతనంగా సేకరించి వాట్సప్‌ ద్వారా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారని ఆరోపించారు. ఆయనపై 120 (బి), 420, 447, 505 (1)(బి) ఐపీసీ, 4(ఎ), 6, రెడ్‌విత్‌ 8 ఆఫ్‌ టీఎస్‌ పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ యాక్ట్‌-1997, సెక్షన్‌ 66-డి ఐటీ యాక్ట్‌-2008 కింద కేసు నమోదు చేశారు.

Bandi Sanjay lunch motion petition in the High Court: మంగళవారం రాత్రి కరీంనగర్‌లో బండి సంజయ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. నిన్నంతా నాటకీయ పరిణామాల అనంతరం హనుమకొండకు తరలించారు. నిన్న కోర్టుకు సెలవు కావడంతో పోలీసులు ఆయనను సాయంత్రం 7 గంటల సమయంలో హనుమకొండ జిల్లా ప్రధాన మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ నివాసానికి తీసుకెళ్లి హాజరుపరిచారు.

కేసు పూర్వాపరాలను పరిశీలించాక.. సంజయ్‌కు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ జిల్లా ప్రధాన మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ రాపోలు అనిత ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాత్రి ఎనిమిదిన్నరకు పోలీసులు ఆయనను కరీంనగర్‌ కారాగారానికి తరలించారు. వెంటనే బీజేపీ లీగల్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. బెయిల్‌ కోసం సంజయ్‌ దరఖాస్తు చేసుకోగా.. పోలీసులు తమ వివరణ కోసం గడువు కోరడంతో విచారణ ఈరోజుకి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

హైకోర్టులో బండి సంజయ్​కు ఎదురుదెబ్బ.. రిమాండ్ రద్దుపై విచారణ వాయిదా

'పది' పేపర్ లీకేజీ.. ప్రభుత్వం రాసిన స్క్రిప్టే: MLA రఘునందన్​రావు

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన.. షెడ్యూల్ ఇదే!

'2024లో మాదే విజయం.. నైరాశ్యంలో విపక్షాలు.. అందుకే నాకు సమాధి కడతామని వ్యాఖ్యలు'

Last Updated : Apr 6, 2023, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details