కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వెళుతున్న ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం.. అరెస్టులకు కారణాలను పేర్కొనకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారంటూ.. టీపీసీసీ ఆధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరో 11 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఆరెస్ట్‌లకు తగిన కారణాలను చూపలేదన్నారని కాంగ్రెస్ నేతల తరఫు న్యాయవాదులు వాదించారు. పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడానికి ఎళుతున్నవారిని అడ్డుకున్నారన్నారు. ఈ నెల 20 నుంచి జులై 3 వరకు వివిధ ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని వాటికి అడ్డుపడకుండా ఆదేశాలివ్వాలని కోరారు. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.