భారతీయ కళలు ఎంతో గొప్పవని... ఇప్పటి తరం సాంస్కృతిక కళలను నేర్చుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ సూచించారు. స్వచ్ఛంద సంస్థ కోసం ప్రముఖ చిత్రకారుడు హరి శ్రీనివాస్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన వీఎస్‌ఎల్ విజువల్ ఇంటర్నేషనల్ ఆర్ట్ గ్యాలరీ ఎపిటోమ్ ఆర్ట్‌షోను ఆయన ప్రారంభించారు. కళాకారుడు వైవిధ్యమైన పెయింటింగ్ వేయడం గొప్ప విషయమని కొనియాడారు.
'భారతీయ కళలు ఎంతో గొప్పవి... ఇప్పటి తరం నేర్చుకోవాలి' - ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్
స్వచ్ఛంద సంస్థ కోసం ప్రముఖ చిత్రకారుడు హరి శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని హైకోర్టు న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రారంభించారు. భారతీయ కళలు ఎంతో గొప్పవని ఆయన కొనియాడారు. ఇప్పటి తరం వాటిని నేర్చుకోవాలని సూచించారు.
'భారతీయ కళలు ఎంతో గొప్పవి... ఇప్పటి తరం నేర్చుకోవాలి'
స్వచ్ఛంద సంస్థ కోసం చిత్ర కళ ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చిత్రకళ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. ప్రదర్శన ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఛారిటీ కోసం ఉపయోగిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి:'హాథ్రస్ కేసులో సాక్షులకు రక్షణ ఎలా?'