ఎంఎంటీఎస్ రెండోదశ (Mmts Second Phase) ప్రారంభం కాకపోవడంపై వివరణ ఇవ్వాలని... దక్షిణ మధ్య రైల్వే, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు (Telangana HighCourt) నోటీసులు జారీచేసింది. రెండోదశలో 62 కిలోమీటర్ల రైల్వేలైన్ పూర్తైనా రైళ్లను నడపడం లేదంటూ సీపీఎం నేత దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
Mmts Second Phase: 'ఎంఎంటీఎస్ రెండోదశపై వివరణ ఇవ్వండి' - Telangana HighCourt news
ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్(Mmts Second Phase)పై దక్షిణ మధ్య రైల్వే, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. సీపీఎం నేత దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
ప్రాజెక్టు వ్యయం భరించడంలో దక్షిణ రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం తలెత్తడంతో ప్రారంభానికి నోచుకోవడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఎంఎంటీఎస్ రెండోదశ ప్రారంభించక పోవడంవల్ల ఇప్పటికే ఖర్చు చేసిన రూ. 808 కోట్లు వృథాగా మారాయని కోర్టుకు వివరించారు. స్పందించిన ధర్మాసనం... కౌంటర్ దాఖలు చేయాలని రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను మార్చి 11కి వాయిదా వేసింది.
ఇవీచూడండి:Tomato Price: 'టమాట ధర... మరో రెండు నెలల పాటు తగ్గేదేలే'