Puvva Ajay: ఖమ్మంలో భాజపా కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనలో కేంద్ర, రాష్ట్ర హోంశాఖలు, ఖమ్మం సీపీ, త్రీటౌన్ ఎస్‌హెచ్‌వో, సీబీఐకి కూడా నోటీసులిచ్చింది. ఖమ్మం తెరాస నేత ప్రసన్నకృష్ణ, సీఐ సర్వయ్యకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
ఈ ఘటనపై న్యాయవాది కె.కృష్ణయ్య దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. భాజపా కార్యకర్త సాయి గణేశ్ ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు జరపాలని పిటిషనర్ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. రెండు వారాల్లో ఘటనపై వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.