ప్రైవేటు విద్యాసంస్థల్లో ఆన్లైన్ తరగతులు, ఫీజులకు సంబంధించిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్రంలో లాక్డౌన్ (lock down) ఎత్తివేసినందున... ప్రస్తుతం ఆన్లైన్ తరగతులకు సంబంధించిన అంశాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రైవేటు పాఠశాలలు జీవో 46కి విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేశాయని... హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫు న్యాయవాది వాదించారు.
School Fee Issue: 'ఆ పాఠశాలలపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకుంటాం' - హైదరాబాద్ తాజా వార్తలు
కరోనా వేళ జీవో 46కి విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు పాఠశాలలపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకుంటామని... రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు (High court) తెలిపింది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఆన్లైన్ తరగతులు, ఫీజులకు సంబంధించిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది.
జీవో 46ను ఉల్లంఘించిన ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు ప్రారంభించామని... రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ హైకోర్టుకు (High court) తెలిపింది. ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకున్నామని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ప్రైవేటు పాఠశాలలపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకుంటామని చెప్పింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలలపై చర్యలు తీసుకునే పరిధి తమకు లేదని... సంబంధిత బోర్డుల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వ వివరణను నమోదు చేసిన ధర్మాసనం... పిల్‌పై విచారణ ముగించింది.
ఇదీ చదవండి: MAOIST LEADER: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ మృతి!