తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త సాదా బైనామాల దరఖాస్తులు పరిశీలించవద్దు : హైకోర్టు

కొత్త సాదా బైనామాల దరఖాస్తులు పరిశీలించవద్దు : హైకోర్టు
కొత్త సాదా బైనామాల దరఖాస్తులు పరిశీలించవద్దు : హైకోర్టు

By

Published : Nov 11, 2020, 11:55 AM IST

Updated : Nov 11, 2020, 12:30 PM IST

11:52 November 11

కొత్త సాదా బైనామాల దరఖాస్తులు పరిశీలించవద్దు : హైకోర్టు

సాదా బైనామాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో విచారణ జరిగింది. కొత్తగా అందిన దరఖాస్తులను పరిశీలించొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రెవెన్యూ చట్టం అమలు తర్వాత వచ్చిన దరఖాస్తులు పరిశీలించవద్దని స్పష్టం చేసింది. రద్దయిన చట్టం ప్రకారం ఎలా క్రమబద్ధీకరణ చేస్తారని ప్రశ్నించింది. కొత్త రెవెన్యూ చట్టానికి ముందు దరఖాస్తులను పరిశీలించవచ్చని హైకోర్టు తెలిపింది.  

ఏజీ వాదిస్తూ అక్టోబర్‌ 29 నుంచి కొత్త రెవెన్యూచట్టం అమల్లోకి వచ్చిందని కోర్టుకు తెలిపారు. అక్టోబర్‌ 10 నుంచి 29 వరకు 2,26,693 దరఖాస్తులు అందాయన్నారు. అక్టోబర్‌ 29 నుంచి నిన్నటి వరకు 6,74,201 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. కౌంటర్ దాఖలుకు 2 వారాల గడువు కావాలన్నారు.  

తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు 6,74,201 దరఖాస్తులు పరిశీలించవద్దని ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. 2,26,693 దరఖాస్తులపై నిర్ణయం కూడా తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. నిర్మల్ జిల్లాకు చెందిన రైతు షిండే సాదా బైనామాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో పిటిషన్​ వేశారు. 

ఇదీ చదవండి:కమాండ్‌ కంట్రోల్‌ అండ్‌ డేటా సెంటర్​ను ప్రారంభింటిన కేటీఆర్​

Last Updated : Nov 11, 2020, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details