పదో తరగతి పరీక్షల అంశంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ చేయనుంది. ప్రైవేట్ పాఠశాలలోని హాస్టళ్లలో విద్యార్థులు ఉండేందుకు అనుమతిస్తామని విద్యాశాఖ కోర్టుకు తెలిపింది. పరీక్షలకు హాజరుకాలేని వారు ఆగస్టులో సప్లిమెంటరీ రాసుకోవచ్చని సూచించింది.
పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా? - పదొ తరగతి పరీక్షలపై తెలంగాణ హైకోర్టులో విచారణ
పదో తరగతి పరీక్షల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.
పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?: హైకోర్టు
దీనిపై స్పందించిన న్యాయస్థానం సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా అని విద్యాశాఖను ప్రశ్నించింది. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణించడం మంచిదని స్పష్టం చేసింది. ప్రభుత్వాన్ని సంప్రదించి రేపు చెబుతామని హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు.
ఇదీ చదవండి:కొత్తిమీర రైతుకు.. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
Last Updated : Jun 5, 2020, 2:47 PM IST
TAGGED:
తెలంగామ హైకోర్టు