తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుపతి ఉపఎన్నిక రద్దు చేయాలనే వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు విచారణ

ఏపీలోని తిరుపతి ఉపఎన్నికపై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఉపఎన్నిక రద్దు చేయాలని తెదేపా, భాజపా అభ్యర్థులు వేసిన పిటిషన్లపై విచారణ జరిపింది. వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.

తెలంగాణ వార్తలు
ఏపీ వార్తలు

By

Published : Apr 27, 2021, 2:12 PM IST

Updated : Apr 27, 2021, 3:51 PM IST

తిరుపతి ఉపఎన్నిక రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్​పై విచారణ జరిగింది. ఫలితాలు ప్రకటించకుండా నిలువరించాలని భాజపా అభ్యర్థి రత్నప్రభ తరఫు న్యాయవాది కోరారు.

వేలమంది దొంగ ఓట్లు వేసినట్లు తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫు న్యాయవాది తెలిపారు. ఉపఎన్నిక రద్దు చేసి రీపోలింగ్‌కు ఆదేశించాలని కోరారు. ఈ మేరకు వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:'ఈటీవీ బాలభారత్'​ ఛానెళ్ల​ను ప్రారంభించిన రామోజీరావు

Last Updated : Apr 27, 2021, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details