మంత్రివర్గ నిర్ణయంపై హైకోర్టు ఆశ్చర్యం - తెలంగాణ సచివాలయం కూల్చివేత
15:55 February 12
మంత్రివర్గ నిర్ణయంపై హైకోర్టు ఆశ్చర్యం
సచివాలయం కూల్చివేతలపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు భవనాలు కూల్చవద్దని న్యాయస్థానం ఆదేశించింది. సచివాలయం నిర్మాణంపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోలేదని అదనపు ఏజీ పేర్కొన్నారు.
తుది నిర్ణయం తీసుకోకుండానే భవనాల కూల్చివేతపై తొందర ఎందుకని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది. నిర్మాణ డిజైన్ లేకుండానే కొత్త సచివాలయం నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది.