సచివాలయం కూల్చివేతల కవరేజీకి అనుమతివ్వాలన్న పిటిషన్‌పై శనివారం హైకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం పిటిషన్ విచారించారు. పిటిషనర్‌కు విచారణ అర్హత లేదని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. వీఐఎల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున సంస్థ భాగస్వాములు కాకుండా.. ఉద్యోగి పిటిషన్ దాఖలు చేయడం కుదరదని పేర్కొన్నారు.
ఏ ఉత్తర్వుల ప్రకారం పోలీసులను మొహరించారు: హైకోర్టు - hyderabad latest news
ఏ ఉత్తర్వుల ప్రకారం సచివాలయం వద్ద పోలీసులను మొహరించారో తెలపాలని ప్రభుత్వాన్నిహైకోర్టు ఆదేశించింది. సచివాలయం కూల్చివేతల కవరేజీకి అనుమతివ్వాలన్న పిటిషన్‌పై జస్టిస్ చల్లా కోదండరాం శనివారం విచారణ చేపట్టారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
ఏ ఉత్తర్వుల ప్రకారం పోలీసులను మొహరించారు: హైకోర్టు
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సంస్థ తరఫున ఉద్యోగి కూడా పిటిషన్ వేయవచ్చునని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. అవసరమైతే సంస్థ యాజమాన్య ప్రతినిధులను కూడా చేరుస్తామని తెలిపారు. ప్రభుత్వం కూడా కౌంటరు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఏ ఉత్తర్వుల ప్రకారం పోలీసులను మొహరించారో తెలపాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.