సచివాలయం కూల్చివేతలు ఆపాలంటూ తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.
కూల్చివేతలు, నిర్మాణాల నిబంధనల ప్రకారం పర్యావరణ అనుమతులు అవసరం లేదని పీసీబీ నివేదించింది. కూల్చివేతలు, నిర్మాణాల నిబంధనలను అడగలేదని.. పర్యావరణ పరిరక్షణ నిబంధనల ప్రకారం అనుమతి అవసరమా అని ప్రశ్నిస్తే.. సరైన సమాధానం ఇవ్వలేదని పీసీబీపై అసహనం వ్యక్తం చేసింది ఉన్నత న్యాయస్థానం. నివేదికలుగా తెలివిగా ఇవ్వొద్దని.. నిజాయితీగా ఇవ్వాలని వ్యాఖ్యానించింది.