బంజారాహిల్స్‌లో పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి పాత ఎఫ్‌ఐఆర్ జత చేసి తాజా కేసులో ఆదేశాలివ్వాలన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తప్పుబట్టింది. పబ్‌లో దాడుల అనంతరం నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సమర్పించాలని ఆదేశిస్తూ కోర్టు విచారణను ఆగస్టు 24కు వాయిదా వేసింది. పబ్‌లో మాదకద్రవ్యాల వినియోగంపై పోలీసులు నమోదు చేసిన కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఎన్సీబీ, సీబీఐ, డీఆర్‌ఐలకు అప్పగించాలని రేవంత్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
పుడింగ్ పబ్ కేసులో రేవంత్‌రెడ్డి అభ్యర్థనను తప్పుబట్టిన హైకోర్టు
హైదరాబాద్ బంజారాహిల్స్ పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో పాత ఎఫ్ఐఆర్ జతచేసి కొత్త కేసులో ఆదేశాలివ్వాలన్న రేవంత్‌రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తప్పుబట్టింది. దాడులు చేసిన అనంతరం నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 24కు వాయిదా వేసింది.
పుడింగ్ పబ్ కేసులో రేవంత్‌రెడ్డి అభ్యర్థనను తప్పుబట్టిన హైకోర్టు
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పోలీసులు దాడి చేసిన సమయంలో పబ్ సిబ్బందితో పాటు 148 మంది అందులో ఉన్నారని పేర్కొన్నారు. ఇందులో ఒకరిద్దరు మినహా మిగిలిన వారినుంచి ఎలాంటి రక్తనమూనాలు సేకరించకుండా పంపించారని కోర్టుకు వివరించారు. పాత ఎఫ్‌ఐఆర్‌ను జత చేసి కొత్త కేసులో ఆదేశాలు ఇవ్వాలని కోరగా అందుకు హైకోర్టు నిరాకరించింది.
ఇవీ చదవండి:
TAGGED:
high court news