అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై నివేదిక సమర్పించేందుకు ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ను సవాల్ చేస్తూ 2016లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. బీఆర్ఎస్కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి. వాటిలో తిరస్కరించినవి ఎన్ని తదితర వివరాలు సమర్పించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది.
'2016 పిల్‌పై కౌంటర్ దాఖలుకు జాప్యం ఎందుకు?' - ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
భవనాల క్రమబద్ధీకరణపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిగింది. బీఆర్ఎస్‌పై నివేదిక సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది. 2016లో దాఖలైన పిల్‌లో కౌంటర్ దాఖలుకు ఇంత జాప్యం ఎందుకని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

'2016లో దాఖలైన పిల్‌లో కౌంటర్ దాఖలుకు జాప్యం ఎందుకు?'
జీహెచ్ఎంసీ నివేదిక సమర్పించిందని.. పురపాలక శాఖ కౌంటరు కోసం కొంత సమయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. 2016లో దాఖలైన పిల్‌లో వివరాలు సమర్పించేందుకు ఇంత జాప్యమెందుకని న్యాయస్థానం ప్రశ్నించింది. కౌంటరు దాఖలు చేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నామన్న హైకోర్టు.. విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: 'నేరచరిత గల నేతల కేసులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం'