ప్రభుత్వ ఉద్యోగుల వేతనం, పింఛనులో కోతపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టులు తెరిచాక విచారణ జరపాలని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ కోరగా... ఇప్పటికే చాల ఆలస్యమైందని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రభాకర్ పేర్కొన్నారు. ఇరువురి వాదనలు విన్న తరువాత తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది.
వేతనలు, పింఛను కోతపై విచారణ సెప్టెంబర్ 8కి వాయిదా - తెలంగాణ హైకోర్టు వార్తలు
వేతనలు, పింఛనులో కోతకు సంబంధించిన ఆర్టినెన్స్పై హైకోర్టులో విచారణ జరిపింది. కోర్టులు తెరిచాక విచారణ జరపాలని అడ్వొకేట్ జనరల్ కోరగా... ఇప్పటికే చాలా ఆలస్యమైందని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
![వేతనలు, పింఛను కోతపై విచారణ సెప్టెంబర్ 8కి వాయిదా high court hearing on pensions and salary cutting in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8578173-thumbnail-3x2-hc.jpg)
వేతనలు, పింఛను కోతపై విచారణ సెప్టెంబర్ 8కి వాయిదా
లాక్డౌన్ సమయంలో ఆదాయం తగ్గినందున ఆర్థిక లోటును పూడ్చేందుకు ఉద్యోగుల, పెన్షనర్ల వేతనాల్లో కోత విధించింది. దీనిని సవాల్ చేస్తూ కొందరు విశ్రాంత ఉద్యోగులు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.