HC ON MLC VENKATARAMIREDDY: వరి విత్తనాల విక్రయాలపై కోర్టులకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు తేలితే జైలుకు పంపిస్తామని మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని హైకోర్టు హెచ్చరించింది. కోర్టుకు సంబంధించి వ్యాఖ్యలు చేశారా.. లేదా సూటిగా పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని వెంకట్రామిరెడ్డికి ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గతేడాది అక్టోబర్లో సిద్దిపేటలో జరిగిన వ్యవసాయాధికారులు, విత్తన డీలర్లతో నిర్వహించిన సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వెంకట్రామిరెడ్డిపై ఆరోపణలున్నాయి.
HC ON MLC VENKATARAMIREDDY: 'అలా మాట్లాడినట్లు తేలితే జైలుకు పంపిస్తాం' - HIGH COURT LATEST NEWS
HC ON MLC VENKATARAMIREDDY: వరి విత్తన విక్రయాలకు సంబంధించి మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. సిద్దిపేట కలెక్టర్గా కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారన్న సుమోటో వ్యాజ్యంపై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. కోర్టులకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారా లేదా సూటిగా చెప్పాలని ఆదేశించింది. కోర్టులకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు తేలితే జైలుకు పంపిస్తామని హెచ్చరించింది.
యాసంగి పంట కోసం వరి విత్తనాలు అమ్మితే కేసులు పెడతామని.. హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా వదిలిపెట్టమని వెంకట్రామిరెడ్డి అన్నారన్న ఆరోపణలకు సంబంధించిన సుమోటో వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం విచారణ చేపట్టింది. గత ఆదేశాల మేరకు వెంకట్రామిరెడ్డి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే అఫిడవిట్లో వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన ప్రస్తావనే లేకపోవడంపై ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టుకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారా.. లేదా సూటిగా పేర్కొంటూ తాజాగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని వెంకట్రామిరెడ్డిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని.. జైలుకు పంపిస్తామని వ్యాఖ్యానించిన హైకోర్టు.. విచారణను ఏప్రిల్ 4కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: CM KCR Mumbai Tour : 'సరైన సమయంలో గళం విప్పారు'.. సీఎం కేసీఆర్కు ఉద్దవ్ ఠాక్రే ఫోన్