ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలపై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ ముగిసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఎస్ఈసీ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది ఆది నారాయణరావు వాదనలు వినిపించగా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఇప్పటికే వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేసింది.
ఏపీ పంచాయతీ ఎన్నికలపై ముగిసిన విచారణ... తీర్పు రిజర్వ్ - హైకోర్టు వార్తలు
ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను నిలిపివేస్తూ.. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.
![ఏపీ పంచాయతీ ఎన్నికలపై ముగిసిన విచారణ... తీర్పు రిజర్వ్ ఏపీ పంచాయతీ ఎన్నికలపై ముగిసిన విచారణ... తీర్పు రిజర్వ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10295098-227-10295098-1611035763725.jpg)
ఏపీ పంచాయతీ ఎన్నికలపై ముగిసిన విచారణ... తీర్పు రిజర్వ్
నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేటట్లు.. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా... షెడ్యూల్ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను నిలిపివేస్తూ... ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.