జవహర్‌నగర్ డంపింగ్ యార్డును మరో చోటకు తరలించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. కల్నల్ సీతరామరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.
డంపింగ్‌యార్డు తరలింపుపై హైకోర్టు విచారణ - జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలింపుపై హైకోర్టు విచారణ
జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తరలించాలన్న వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈనెల 27న జరిగే విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.
డంపింగ్‌యార్డు తరలింపుపై హైకోర్టు విచారణ
పరిసర ప్రాంతాల ప్రజలు దుర్గంధం భరించలేకపోతున్నారని... మెదక్, రంగారెడ్డి తదితర ప్రాంతాలకు తరలించాలని పిటిషనర్ కోరారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు సంబంధించి మూడో ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరుపుతున్నామన్న ధర్మాసనం... తదుపరి విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: '5 రోజుల్లో డంపింగ్ యార్డును తీర్చిదిద్దాలి'