High Court Stay On Ratnakar Arrest: ఐటీ అధికారి రత్నాకర్‌పై మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పెట్టిన కేసుపై హైకోర్టు స్టే విధించింది. నాలుగు వారాల పాటు దర్యాప్తు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్పత్రిలో ఉన్న తన సోదరుడు మహేందర్ రెడ్డిని బెదిరించి.. దౌర్జన్యం చేయించి బలవంతంగా సంతకాలు తీసుకున్నారని రత్నాకర్‌పై భద్రారెడ్డి బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రత్నాకర్‌పై ఐపీసీ 384 ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
హైకోర్టులో ఐటీ అధికారి రత్నాకర్ పిటిషన్.. దర్యాప్తుపై 4 వారాల స్టే
15:45 November 25
హైకోర్టులో ఐటీ అధికారి రత్నాకర్ పిటిషన్.. దర్యాప్తుపై 4 వారాల స్టే
తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ ఐటీ అధికారి రత్నాకర్ ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. మంత్రి మల్లారెడ్డి తన అనుచురులతో వచ్చి దౌర్జన్యం చేసి దస్త్రాలు లాక్కున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. మల్లారెడ్డి మంత్రి కాబట్టి పోలీసులు తనను వేధించే అవకాశం ఉందని చెప్పారు. ఐటీ అధికారిగా విధులు నిర్వహించాను.. తప్ప ఎవరికీ ఎలాంటి దౌర్జన్యం చేయలేదని అన్నారు. ఐటీ చట్టం ప్రకారం అధికారికి ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ ఉంటుందని తెలిపారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేందర్.. కేసు విచారణ, రత్నాకర్ అరెస్ట్‌పై నాలుగు వారాలు స్టే విధించారు.
ఇవీ చదవండి:మల్లారెడ్డి X ఐటీ.. ఆ మూడ్రోజులు ఏం జరిగిందంటే..?
కోతికి 'జీవిత ఖైదు'.. ఇప్పటికే ఐదేళ్లు శిక్ష పూర్తి.. వానరం చేసిన నేరం ఇదే..