మేడ్చల్ జిల్లా రాయదుర్గం భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టు విచారించింది. ప్రభుత్వం, టీఎస్ఐఐసీ, డీఎల్ఎఫ్, మై హోం సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
భూ కేటాయింపులపై 'రేవంత్' పిటిషన్... సర్కారుకు హైకోర్టు నోటీసులు - మేడ్చల్ జిల్లా
రాయదుర్గం భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న రేవంత్ రెడ్డి పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ప్రభుత్వంతో సహా పలు సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

రాయదుర్గం భూ కేటాయింపుల్లో అక్రమాలపై విచారణ
31.35 ఎకరాల భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని రేవంత్ రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. మై హోం సంస్థకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.
ఇవీ చూడండి:'హిందూ దేవాలయాలు ఎలా అభివృద్ధి చేసుకోవాలో మాకు తెలుసు'