High Court comments on flood relief measures : వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై హైకోర్టులో ఇవాళ కూడా విచారణ సాగింది. చెరుకు సుధాకర్ ఈ పిటిషన్ వేశారు. వరదల సమయంలో మృతి చెందిన కొందరి వివరాలను ప్రభుత్వ నివేదికలో ప్రస్తావించలేదన్న పిటిషనర్ కోర్టుకు వివరించారు. వరద విషయంలో ముందుగా హెచ్చరికలున్నా.. ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు.
విషజ్వరాల నియంత్రణకు ఇంత వరకు చర్యలు చేపట్టలేదని పిటిషనర్ చెరుకు సుధాకర్ తరఫు న్యాయవాది వివరించారు. వాదనలు విన్న హైకోర్టు గల్లంతైన వారిని గుర్తించేందుకు ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకుందో చెప్పాలని ప్రశ్నించింది. అలాగే భూపాలపల్లి జిల్లాలో మృతుల వివరాలను తెలపాలని కోరింది. కడెం ప్రాజెక్టు సమీప ప్రజల రక్షణకు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకుంది.
- Telangana Rain Effect 2023 : వరద ఉద్ధృతికి దెబ్బతిన్న పొలాలు.. నెక్స్ట్ పంట ఇక ఎండాకాలంలోనే!
- Warangal Floods 2023 : ఇంకా గాడిన పడని వరంగల్.. ఇళ్లను శుభ్రం చేసుకోవడంలోనే గడిచిపోతున్న రోజులు
Telangana Govt on flood relief measures : స్పందించిన ప్రభుత్వ తరపు న్యాయవాది.. వర్షాలకు 41మంది మృతి చెందారని కోర్టుకు తెలిపారు. 1.59లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని న్యాయస్థానానికి వివరించారు. రెండు రోజుల్లో మరో నివేదిక ఇస్తామని ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. ఇరు వాదనలను విన్న హైకోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.