హైదరాబాద్లోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఫీజుల నియంత్రణపై సిఫార్సుల కోసం ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని నియమించి మూడేళ్లు గడుస్తున్న ఇంకా ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది.
ఫీజుల నియంత్రణపై చర్యలేవి? - ఫీజుల నియంత్రణపై చర్యలేవి?
ప్రైవేట్ పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు సంబంధించిన ప్రొఫెసర్ తిరుపతి రావు కమిటీ నివేదికపై ఏప్రిల్ 8 లోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే ఎందుకు నియంత్రించ లేకపోతున్నారని ప్రశ్నించింది. తదుపరి విచారణకు రుసుముల నియంత్రణ కోసం సమగ్ర విధానంతో రావాలని సర్కారుకు న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఫీజుల నియంత్రణపై చర్యలేవి?
ఎనిమిది వారాల గడువు కావాలని ఏజీ కోరగా.. రానున్న విద్యా సంవత్సరానికి పలు విద్యా సంస్థలు ఇప్పటికే ఫీజుల వసూలు మొదలు పెట్టాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఏప్రిల్ 8లోగా కమిటీ సిఫార్సులపై నిర్ణయం తీసుకోవచటంతో పాటు.. ఫీజుల నియంత్రణ కోసం సమగ్ర పాలసీ సిద్ధం చేయాలని ఆదేశించింది.
ఫీజుల నియంత్రణపై చర్యలేవి?
ఇదీ చదవండి :4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం
Last Updated : Mar 12, 2020, 6:30 AM IST
TAGGED:
ఫీజుల నియంత్రణపై చర్యలేవి?