చిన్నారుల అదృశ్యంపై ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించాలని హైకోర్టు ఆదేశించింది. చిన్నారుల అదృశ్యం, అక్రమ రవాణాపై.. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. పలు జిల్లాల్లో జువైనల్ బోర్డులు, సంరక్షణ గృహాలు లేవని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
HIGH COURT: 'చిన్నారుల అదృశ్యంపై సర్కారు మరింత శ్రద్ధ వహించాలి' - telangana varthalu
చిన్నారుల అదృశ్యం, అక్రమ రవాణాపై హైకోర్టు విచారణ చేపట్టింది. చిన్నారుల అదృశ్యంపై సర్కారు మరింత శ్రద్ధ వహించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

HIGH COURT: 'చిన్నారుల అదృశ్యంపై సర్కారు మరింత శ్రద్ధ వహించాలి'
పోలీస్ స్టేషన్లలో బాలల సంరక్షణ అధికారులు లేరని పేర్కొన్నారు. వీటన్నింటిపైనా దృష్టి పెట్టి పరిష్కరించాలని సూచించిన హైకోర్టు.. వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 28కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: Vaccine: వారికి వ్యాక్సినేషన్లో ఇబ్బందులు తొలగించండి