కొవిడ్-19 పరీక్షలపై న్యాయవాది తిరుమలరావు వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా పరీక్షలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందరికీ పరీక్షలు చేయలేకపోతున్నారని పిటిషనర్ వాదించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మహారాష్ట్ర పరిస్థితి వస్తుందన్నారు. స్పందించిన ఉన్నత న్యాయస్థానం కరోనా పరీక్షలు ఎవరికి చేస్తున్నారో మే 13లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
కరోనా పరీక్షలపై నివేదిక సమర్పించండి: హైకోర్టు - తెలంగాణలో కొవిడ్-19 పరీక్షలు
కరోనా పరీక్షలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. న్యాయవాది తిరుమలరావు వ్యాజ్యంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
![కరోనా పరీక్షలపై నివేదిక సమర్పించండి: హైకోర్టు high court hearing on corona tests in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6891938-thumbnail-3x2-high.jpg)
కరోనా పరీక్షలపై నివేదిక సమర్పించండి: హైకోర్టు