తెలంగాణ

telangana

ETV Bharat / state

Treatment rates: ప్రైవేటులో కరోనా వైద్య సేవలకు గరిష్ఠ ధరలివే.. - ts High court hearing on corona conditions

కొవిడ్‌ చికిత్సల కోసం ప్రభుత్వం(government) ఖరారు చేసిన గరిష్ఠ ధరలను(rates) అమలు చేయని ప్రైవేట్ ఆస్పత్రులపై భారీ జరిమానాలు(fines) విధించాలని హైకోర్టు(HC) పేర్కొంది. కరోనాతో (Corona) తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను చేరదీసి వారి అవసరాలు తీర్చాలని తెలిపింది. డెల్టా వేరియంట్ వైరస్‌ను (Delta variant virus) ఎదుర్కొనేందుకు ప్రణాళికేంటో వివరించాలని ఆదేశించింది. దివ్యాంగులను హైరిస్క్‌ కేటగిరిలో చేర్చి వ్యాక్సిన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం సూచించింది.

ts High court hearing on corona conditions
High court: ప్రైవేటులో ధరలపై విస్తృత ప్రచారం కల్పించండి

By

Published : Jun 23, 2021, 8:18 PM IST

రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై హైకోర్టుకు వైద్యారోగ్య శాఖ నివేదిక (Report) సమర్పించింది. రోజుకు సరాసరిగా లక్షకు పైగా కరోనా పరీక్షలు (corona tests) జరుగుతున్నాయని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు (DH) కోర్టుకు నివేదించారు. పాజిటివిటీ రేటు ఒక శాతానికి తగ్గిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 170 ప్రైవేట్ ఆస్పత్రులపై 350 ఫిర్యాదులు వచ్చాయని.. వాటిలో 30 పరిష్కరించి.. బాధితులకు 72 లక్షల 20 వేలు ఇప్పించినట్లు నివేదించారు. మిగతా బాధితులకు న్యాయం చేసేందుకు అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్(Vaccination) చురుగ్గా కొనసాగుతోందని డీహెచ్​ కోర్టుకు వివరించారు. రెండు డోసులు 28.76లక్షల మందికి, ఒక డోసు 68.48 లక్షల మందికి ఇచ్చినట్లు తెలిపారు. ఇంకా కోటి 94 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈనెల 29 నాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి 10 లక్షల 76వేల డోసులు రావల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఎదుర్కొనేందుకు సిద్ధం

మూడో దశ కరోనాను(third wave corona) ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు డీహెచ్​ కోర్టుకు వివరించారు. ప్రభుత్వాసుపత్రుల్లోని 27 వేల 141 పడకల్లో 10 వేల 224 పడకలకు ప్రస్తుతం ఆక్సిజన్(oxyzen) సదుపాయం ఉందని... మిగతా 16 వేల 914 ఆక్సిజన్ సదుపాయం సమకూర్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని శ్రీనివాస్ తెలిపారు. నిలోఫర్ సహా 9 బోధనాస్పత్రులు, జిల్లా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా 6 వేల పడకలు సిద్ధం చేస్తున్నట్లు డీహెచ్ వివరించారు. పిల్లల వైద్య నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి సలహాలు తీసుకుంటున్నామన్నారు. చికిత్సలకు అవసరమైన ఔషధాలు సిద్ధంగా ఉంచామన్నారు.

గరిష్ఠ ధరలు ఖరారు చేస్తూ జీవో

కరోనా చికిత్సలు, పరీక్షల కోసం గరిష్ఠ ధరలు ఖరారు చేస్తూ జీవో జారీ చేసినట్లు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హైకోర్టుకు(high court) నివేదించారు. సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్ఠంగా 4వేల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా చికిత్సకు ఐసీయూ వార్డులో రోజుకు గరిష్ఠంగా 7వేల5వందలుగా ప్రకటించింది. వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్ఠంగా 9వేలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. పీపీఈ కిట్ ధర 273 మించరాదని.. హెచ్ఆర్​సీటీ ​1995, డిజిటల్ ఎక్స్ రే 13 వందలుగా ఖరారు చేసింది. ఐఎల్​ -6.. 13 వందలు, డీ డైమర్ పరీక్ష 3 వందలు ఛార్జీ చేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. సీఆర్​పీ 5 వందలు, ప్రొకాల్ సీతోసిన్ 14వందలు, ఫెరిటిన్ 400, తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాధారణ అంబులెన్సుకు కనీస ఛార్జి 2 వేలుగా నిర్ణయించిన అధికారులు.. కిలోమీటరుగా 75 రూపాయలు మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆక్సిజన్‌ అంబులెన్సుకు కనీస ఛార్జి 3వేలుగా నిర్ణయించగా.. కిలోమీటరుకు 125 రూపాయలు వసూలు చేసేలా GOలో పొందుపరిచారు.

అమలు చేసేలా చర్యలు

ప్రైవేట్ ఆస్పత్రులు గరిష్ఠ ధరలను అమలు చేసేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఛార్జీలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి (chief justice hima kohli), జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఆదేశించింది. ప్రైవేట్ ఆస్పత్రుల రిసెప్షన్లు, బిల్లింగ్ కేంద్రాల వద్ద ఛార్జీల వివరాలను ప్రదర్శించాలని ధర్మాసనం ఆదేశించింది. ఆదేశాలను ఉల్లంఘించిన ఆస్పత్రులపై కేరళ తరహా భారీ జరిమానాలు విధించే అంశాన్ని పరిశీలించి.. తగిన ఉత్తర్వులు జారీ చేయాలని పేర్కొంది.

అనాథలుగా 177 మంది చిన్నారులు

కరోనా వల్ల రాష్ట్రంలో 177 మంది చిన్నారుల అనాథలయ్యారని రాష్ట్ర శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య హైకోర్టుకు నివేదించారు. అనాథ పిల్లలను గుర్తించి.. అవసరమైన సాయం చేసేందుకు న్యాయ సేవాధికార సంస్థ సహకారం తీసుకుంటున్నామని వివరించారు. అనాథలైన చిన్నారులను మానవత్వంతో చేరదీసి.. ఆదరించాలని ధర్మాసనం పేర్కొంది. పది మంది పిల్లలకు ఒకరు లేదా ఇద్దరు అధికారులను నియమించి వారి అవసరాలను తీర్చాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా వేళ గృహ హింసకు (Domestic violence) గురవుతున్న మహిళలను ఆదుకునేందుకు స్పష్టమైన ప్రణాళికలను రూపొందించి సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. డెల్టా వేరియంట్​ను (Delta variant) ఎలా ఎదుర్కొంటారో, ప్రణాళికలేంటో తెలపాలని హైకోర్టు తెలిపింది. దివ్యాంగులను హైరిస్కు కేటగిరిలో చేర్చి వ్యాక్సిన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం కోరింది.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షల గరిష్ఠ ధరలు ఖరారు
సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షల ధరలు రూ.4వేలు
ఐసీయూ వార్డులో రోజుకు కరోనా చికిత్స రూ.7,500
రోజుకు వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గది రూ.9వేలు
పీపీఈ కిట్ ధర రూ.273
హెచ్‌ఆర్‌సీటీ రూ.1995
డిజిటల్ ఎక్స్ రే రూ.1300
ఐఎల్6 రూ.1300
డీ డైమర్ పరీక్ష రూ.300
సీఆర్‌పీ రూ.500
ప్రొకాల్ సీతోసిన్ రూ.1400
ఫెరిటిన్ రూ.400
ఎల్ డీహెచ్ రూ.140
సాధారణ అంబులెన్సుకు కనీస ఛార్జి రూ.2 వేలు (కి.మీ.కు రూ.75)
ఆక్సిజన్‌ అంబులెన్సుకు కనీస ఛార్జి రూ.3వేలు (కి.మీ.కు రూ.125)

ఇదీచూడండి:చికిత్సలు, పరీక్షలకు గరిష్ఠ ధరలపై జీవో జారీ

ABOUT THE AUTHOR

...view details