నూతన అసెంబ్లీ నిర్మాణం కేసుపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. భవనాల కూల్చివేతకు హెచ్‌ఎండీఏ అనుమతి ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎర్రమంజిల్ భవనం కూల్చివేతకు సంబంధించి అనుమతులపై ఆధారాలు చూపాలని కోరింది. స్పష్టమైన సమాధానం ఇచ్చేందుకు ఆలస్యం ఎందుకు అవుతోందని నిలదీసింది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీలో సదుపాయాల కొరత ఏంటో తెలపాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.
భవనాల కూల్చివేతకు హెచ్‌ఎండీఏ అనుమతి ఉందా? - HICOURT
హైకోర్టులో అసెంబ్లీ నిర్మాణం కేసుపై వాడివేడి వాదనలు జరిగాయి.. భవనాల కూల్చివేతకు హెచ్‌ఎండీఏ అనుమతులున్నాయా అని న్యాయస్థానం ప్రశ్నలు లేవనెత్తింది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీలో సదుపాయాల కొరత ఉందా? తెలపాలని ఆదేశించిన కోర్టు.. విచారణ రేపటికి వాయిదా వేసింది.
అసెంబ్లీ నిర్మాణం కేసుపై హైకోర్టులో విచారణ