Mlas Poaching Case Updates: ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐ దిల్లీ విభాగానికి హైకోర్టు అప్పగించింది. దీనిపై దర్యాప్తు చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈ క్రమంలోనే సీబీఐ దిల్లీ ఎస్పీ నేతృత్వంలోని బృందం హైదరాబాద్‌కు వచ్చింది. సిట్ నుంచి కేసు పత్రాలు ఇవ్వాలని సీఎస్‌కు సీబీఐ లేఖ రాసింది. అయితే సోమవారం వరకు కేసు ఫైళ్ల కోసం ఒత్తిడి చేయవద్దని సీబీఐకి హైకోర్టు తెలిపింది. ప్రభుత్వ అప్పీలుపై సోమవారం స్పష్టత వచ్చాక.. ఎఫ్‌ఐఆర్ నమోదు యోచనలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఉంది.
అంతకుముందు కేసు ఫైల్స్ కోసం సీబీఐ ఒత్తిడి చేస్తోందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. సుప్రీం న్యాయవాది దవే వాదనల కోసం.. సోమవారం వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. కేసు సీబీఐకి ఇవ్వడమే సరైందని హైకోర్టులో బీజేపీ వాదనలు వినిపించింది. 2014 నుంచి 37 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారని న్యాయస్థానానికి తెలిపింది. బీజేపీ పిటిషన్‌ను కొట్టివేసినా.. అప్పీల్ ఎందుకు చేశారని ఏజీని హైకోర్టు అడిగింది. పిటిషన్ కొట్టివేయడానికి కారణాలు సరిగా లేవని ధర్మాసనానికి ఏజీ తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ అంశాలు బయటే చూసుకోవాలని వ్యాఖ్యానించింది. ఈ అంశాలు కోర్టులోకి తీసుకురావద్దని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం విచారణను సోమవారంకు వాయిదా వేసింది.