తెలంగాణ

telangana

ETV Bharat / state

'యురేనియం'పై ప్రజాభిప్రాయ సేకరణకు పచ్చజెండా - high court green signal news today

యురేనియం తవ్వకాల్ని విస్తరించే వ్యవహారంపై ప్రజాభిప్రాయ సేకరణకు ఏపీ హైకోర్టు పచ్చజెండా ఊపింది. గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేసింది. తదుపరి విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది.

యురేనియం తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణకు హైకోర్ట్ పచ్చజెండా
యురేనియం తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణకు హైకోర్ట్ పచ్చజెండా

By

Published : Feb 17, 2021, 9:12 AM IST

ఏపీ కడప జిల్లా తుమ్మలపల్లె, సమీప గ్రామాల్లో యురేనియం తవ్వకాల్ని విస్తరించే వ్యవహారంపై ప్రజాభిప్రాయ సేకరణకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేసింది. తాజాగా నోటీస్ ఇచ్చి ప్రక్రియ చేపట్టవచ్చని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు కోర్టు స్పష్టం చేసింది.

తదుపరి విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో పురోగతిని కోర్టు దృష్టికి తెచ్చేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు కల్పించింది.

ABOUT THE AUTHOR

...view details