రాష్ట్రంలో శనివారం నుంచి పీజీ మెడికల్, డెంటల్ పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కరోనా తీవ్రత దృష్టా రేపటి నుంచి ఈనెల 29 వరకు జరగనున్న పీజీ వైద్య, దంత పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ హెల్త్ కేర్ రిఫర్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.
ఆస్పత్రుల్లో పని చేస్తున్న పలువురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారని, మరికొందరు క్వారంటైన్‌లో ఉన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకున్నట్లు కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు హైకోర్టుకు నివేదించారు.