తెలంగాణ

telangana

ETV Bharat / state

అగ్రిగోల్డ్​ ప్రమోటర్లకు బెయిల్​ మంజూరు చేసిన హైకోర్టు - తెలంగాణ హైకోర్టు

మనీలాండరింగ్​కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్​ చేసిన అగ్రిగోల్డ్​ సంస్థ ప్రమోటర్లకు రాష్ట్ర ఉన్నత ధర్మాసనం బెయిల్​ మంజూరు చేసింది. తదుపరి విచారణకు సహకరించాలని నిందితులకు స్పష్టం చేసింది.

hc
hc

By

Published : Mar 10, 2021, 5:29 PM IST

మనీలాండరింగ్ కేసులో అగ్రిగోల్డ్ ప్రమోటర్లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణకు సహకరించాలని నిందితులకు స్పష్టం చేసింది. మనీలాండరింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలతో అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, ఏవీ శేషు నారాయణ రావు, హేమ సుందర ప్రసాద్​ను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.

ఈ కేసులో ఈడీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో.. నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. ఈడీ విచారణకు సహకరించాలని నిందితులకు స్పష్టం చేసింది. అనంతరం ఈ వ్యవహారంలో మరో ఐదుగురు నిందితులకు ముందస్తు బెయిల్ లభించింది.

ఇదీ చదవండి:కాంగ్రెస్​కు సీనియర్​ నేత చాకో రాజీనామా

ABOUT THE AUTHOR

...view details