ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గతేడాది జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని భద్రతపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన న్యాయస్థానం తనిఖీ నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. ఇవాళ హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్వయంగా ధర్మాసనం ఎదుట హాజరై... భద్రత ఏర్పాట్లు, ఎన్వోసీలు, తనిఖీల నివేదికలను సమర్పించారు. వాటిని పరిశీలించిన కోర్టు... రేపటి నుంచి ఎగ్జిబిషన్ నిర్వహించడానికి అనుమతించింది.
నుమాయిష్‌కు హైకోర్టు పచ్చజెండా
రేపటి నుంచి ప్రారంభం కానున్న నుమాయిష్‌కు ఉన్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. గత జనవరిలో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో భద్రతపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన హైకోర్టు... సీపీ అంజనీకుమార్ సమర్పించిన నివేదికను పరిశీలించి వాటిన్నింటినీ కచ్చితంగా అమలుచేయాలని స్పష్టం చేసింది.
నుమాయిష్‌కు హైకోర్టు పచ్చజెండా
నివేదికల్లో పేర్కొన్న విధంగా భద్రత ఏర్పాట్లను కచ్చితంగా అమలు చేయాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నివేదికల్లో పేర్కొన్నట్లు భద్రత ఏర్పాట్లు ఉన్నాయో.. లేవో తనిఖీ చేసి జనవరి 6న నివేదిక సమర్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.
ఇదీ చూడండి: మద్యం సేవించి వాహనాలు నడపొద్దు: సీపీ