జర్నలిస్టు రఘుపై నమోదైన కేసుల వివరాలను సమర్పించాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. రఘు భార్య లక్ష్మీ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 14లోగా కేసుల వివరాలు సమర్పించాలని డీజీపీకి హైకోర్టు స్పష్టం చేసింది. రఘు బెయిల్ పిటిషన్ రేపు విచారణ ఉన్నందున కేసుల వివరాలు ఇవ్వాలని పిటిషనర్ లక్ష్మీ.. ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది.
High Court: ‘కేసుల వివరాల కోసం వినతిపత్రం ఎందుకివ్వాలి’ - తెలంగాణ హైకోర్టు
పాత్రికేయుడు రఘుపై నమోదైన కేసుల వివరాల కోసం వినతి పత్రం ఇవ్వాల్సిన అవసరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. రఘు భార్య పిటిషన్‌పై విచారణ జరగ్గా... కేసుల వివరాలు సమర్పించాలని డీజీపీని ఈ మేరకు హైకోర్టు ఆదేశించింది.
‘కేసుల వివరాల కోసం వినతిపత్రం ఎందుకివ్వాలి’
కేసుల వివరాల కోసం డీజీపీకి వినతిపత్రం ఇవ్వాల్సిన అవసరమేంటని హైకోర్టు ప్రశ్నించింది. డీజీపీకి వినతిపత్రం ఇవ్వాలని ఒత్తిడి చేయకుండా కేసుల వివరాలు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:Vaccination: పిల్లలకు అన్ని టీకాలు వేయాల్సిందే..!