ఆర్టీసీ కార్మికుల సకలజనుల సమరభేరికి హైకోర్టు షరతులతో కూడిన అనుమతిచ్చినట్లు ఐకాస నాయకులు వెల్లడించారు. రేపు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం తెలిపిందని పేర్కొన్నారు. ప్రభుత్వం హైకోర్టుకు అన్ని బోగస్ లెక్కలు నివేదించిందని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 నుంచి 14 వరకు రూ.1099 కోట్లు రావాలన్నారు. 2014 నుంచి 2019 వరకు రాయితీలు, రీయింబర్స్‌మెంట్ కింద రూ.1,375 కోట్లు రావాలని స్పష్టం చేశారు. మున్సిపల్ చట్టం కింద రూ.1,496 కోట్లు ఆర్టీసీకి రావాల్సి ఉందని కోర్టుకు వివరించినట్లు అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. సమరభేరి సభకు సబ్బండ వర్గాలు వచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆర్టీసీ ఐకాస నాయకులు విజ్ఞప్తి చేశారు.
'సమరభేరికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ .. 3 గంటల పాటు అనుమతి' - HC ON TSRTC STRIKE LATEST NEWS IN TELUGU
ఆర్టీసీ సమ్మెలో భాగంగా భారీ సభను నిర్వహించాలని తలచిన కార్మికులకు హైకోర్టు ఊరటనిచ్చింది. సమరభేరి సభను జరుపుకునేందుకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. హైకోర్టుకు ప్రభుత్వం అన్ని బోగస్ లెక్కలు చూపించిందని ఆరోపించిన నాయకులు... సబ్బండవర్గాలు వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.

HIGH COURT GAVE PERMISSION TO TSRTC EMPLOYEES MEETING IN HYDERABAD WITH CONDITIONS
'సభకు అనుమతి వచ్చింది... సమరభేరికి సిద్ధంకండి'
Last Updated : Oct 29, 2019, 7:11 PM IST