మున్సిపల్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లలో లోపాలు జరిగాయంటూ 71 మున్సిపాలిటీలకు సంబంధించి హైకోర్టులో 81 వేర్వేరు పిటిషన్లు వేశారు. సింగిల్ జడ్జి వద్ద ఈ వ్యాజ్యాలన్నీ దాఖలయ్యాయి. వీటిపై ప్రస్తుతం స్టే అమల్లో ఉంది. మరోవైపు మరికొందరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా వేశారు.
సింగిల్ జడ్జి ముందు విచారణ:
ఐదు రోజుల క్రితం ప్రజా ప్రయోజనాల పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్తో కూడిన ధర్మాసనం... వాటన్నింటిని కొట్టేసింది. అయితే హైకోర్టు సింగిల్ జడ్జి పలు మున్సిపాలిటీల ఎన్నికలపై వేర్వేరుగా స్టే విధించారు. వాటిపై జస్టిస్ చల్లా కోదండరాం ఇవాళ విచారణ చేపట్టారు. ధర్మాసనం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కొట్టి వేసినందున... రిట్ పిటిషన్లన్నీ కలిపి విచారణ జరిపి కొట్టివేయాలని అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు న్యాయస్థానాన్ని కోరారు.