సంక్రాంతి వేళ కోడి పందేలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాల్ని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని.... అధికారులకు ఏపీ హైకోర్టు స్పష్టంచేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలో కోడిపందేలు, బెట్టింగ్‌లను నిలువరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ... ఆ జిల్లాలోని పెదపూడి గ్రామానికి చెందిన పాత్రికేయుడు షేక్ సలీం హైకోర్టులో పిల్ వేశారు.
'కోడి పందాలు జరగకుండా గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలి' - news updates in andhra pradhesh high court
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి గ్రామానికి చెందిన పాత్రికేయుడు షేక్ సలీం వేసిన పిల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది.
high court
ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. కోడి పందేలు జరగకుండా చూడాలని కలెక్టర్లను, ఎస్పీలకు 2016లో హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది . కోర్టు ఉత్తర్వులను అధికారులు పాటించలేదంటూ గతంలో దాఖలైన కోర్టు ధిక్కరణ కేసుతో కలిపి ప్రస్తుత వ్యాజ్యాన్ని విచారిస్తామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.
TAGGED:
ఆంధ్రప్రదేశ్ హై కోర్టు