అమరావతిలో 144 సెక్షన్, పోలీస్‌యాక్ట్ 30 అమలు చేయడంపై ఏపీ ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని గ్రామాలకు చెందిన పలువురు మహిళలు, రైతులు సోమవారం దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం ఇవాళ విచారించింది. పిటిషనర్లు ఇచ్చిన దృశ్యాలను న్యాయమూర్తి పరిశీలించారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదిస్తూ వచ్చే సోమవారానికి వాయిదా కోరగా.. న్యాయమూర్తి నిరాకరించారు. ఈ అంశంలో త్వరగా విచారణ జరపాల్సిన అవసరముందని హైకోర్టు అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో శుక్రవారంలోపు ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అమరావతిలో ఆంక్షలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం - high court on police act
రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్, పోలీస్‌యాక్ట్ 30 అమలు చేయడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలతో శుక్రవారంలోగా ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
high-court
పిటిషనర్ల తరఫు న్యాయవాది
పోలీసుల దాడిలో గాయపడిన మహిళలు రిట్ పిటిషన్లు వేశారని రాజధాని ప్రాంత రైతులు, మహిళల తరఫు న్యాయవాది తెలిపారు. అఫిడవిట్ ద్వారా సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని కోరిందన్నారు. కోర్టుకు ఇచ్చిన దృశ్యాల్లో పోలీసుల అత్యుత్సాహం కనిపిస్తోందని చెప్పారు. రాజధాని గ్రామాల్లో మహిళలు ప్రశాంతంగా నిరసనలు తెలుపుతున్నారన్నారు. ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిర్బంధించారనే ఆరోపణలతో మహిళలు పిటిషన్లు వేసినట్లు చెప్పారు.