కోర్టుల్లో ఒప్పంద ఉద్యోగుల కోసం కొవిడ్ నిధి ఏర్పాటు - high court decision
కోర్టుల్లో విధులు నిర్వహిస్తోన్న ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది వైద్యావసరాల కోసం కొవిడ్ నిధిని హైకోర్టు ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని న్యాయమూర్తులందరూ ఈ నిధికి విరాళాలు అందజేయాలని కోరింది.
కోర్టుల్లో ఒప్పంద ఉద్యోగుల కోసం కొవిడ్ నిధి ఏర్పాటు
కోర్టుల్లో ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది వైద్యావసరాల కోసం హైకోర్టు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. కరోనా నిధికి విరాళాలు ఇచ్చేందుకు హైకోర్టు న్యాయమూర్తులు ముందుకొచ్చారు. రాష్ట్రంలోని న్యాయమూర్తులందరూ విరాళం ఇవ్వాలని కోరారు. అంతేకాక ఆన్‌లైన్ పిటిషన్ల దాఖలు విధానం కొనసాగించాలని హైకోర్టు నిర్ణయించింది. జులై 20 వరకు ఈ విధానాన్ని కొనసాగించాలని సూచించింది.