కరోనా పరీక్షలు తగ్గించడంపై హైకోర్టు అసంతృప్తి - corona cases in ts
11:44 May 05
కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేసింది. విచారణకు డీహెచ్ శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. కరోనా పరీక్షలు తగ్గించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
వైరస్ తీవ్రత పెరుగుతుంటే పరీక్షలు ఎందుకు తగ్గిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 49.97 శాతం పడకలు నిండాయన్న డీహెచ్... ఆక్సిజన్ తరలించకుండా తమిళనాడు అడ్డుకుంటోందన్నారు. తమిళనాడు నుంచి ఆక్సిజన్ రప్పిస్తామని అదనపు ఎస్‌జే తెలిపారు.