ఒప్పంద డిగ్రీ, జూనియర్ లెక్చరర్లను క్రమబద్ధీకరించవద్దన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం క్రమబద్ధీకరించక ముందే ఊహించుకొని పిటిషన్ ఎలా వేస్తారని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒప్పంద డిగ్రీ, జూనియర్ లెక్చరర్లను క్రమబద్ధీకరించవద్దని కోరుతూ వివిధ జిల్లాలకు చెందిన 24 మంది నిరుద్యోగులు 2016లో పిటిషన్ దాఖలు చేశారు. ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తే పీజీ చదువుకున్న తమకు అన్యాయం జరుగుతుందని.. ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాలని కోరారు. పిటిషన్పై ఇవాళ ప్రధాన న్యామయూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
నిరుద్యోగుల పిటిషన్ కొట్టివేత - తెలంగాణ వార్తలు
ఒప్పంద జూనియర్, డిగ్రీ లెక్చరర్లను క్రమబద్ధీకరించవద్దని 24 మంది నిరుద్యోగులు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఊహించుకుని ఎలా పిటిషన్ వేస్తారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
ఒప్పంద లెక్చరర్ల పిటిషన్ కొట్టివేత
ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించిందా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇంకా చేయలేదని క్రమబద్ధీకరణకు ప్రతిపాదనలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఊహించుకొని పిటిషన్ ఎలా వేస్తారని అసహనం వ్యక్తం చేస్తూ పిటిషనర్లు ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాలని హైకోర్టు పేర్కొంది.
ఇదీ చదవండి: మొన్న కోళ్లు.. నిన్న కాకులు.. ఇవాళ కుక్కలు
Last Updated : Feb 3, 2021, 8:06 PM IST